ETV Bharat / bharat

చాక్లెట్ల కోసం వెళ్లిన 59 మంది బాలికలపై అఘాయిత్యం

కేరళ పాలక్కడ్​ జిల్లాలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ దుకాణదారుడు 59 మంది పాఠశాల బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

author img

By

Published : Jul 16, 2019, 11:11 AM IST

చాక్లెట్ల కోసం వెళ్లిన 59 మంది బాలికలపై అఘాయిత్యం

బాలికలపై మృగాళ్ల పైశాచికత్వంపై రోజూ వార్తలు వింటూనే ఉన్నాం. వయస్సుతో సంబంధం లేకుండా అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. మైనర్లపై లైంగిక వేధింపులకు అడ్డుకట్ట పడటంలేదు. కఠినమైన చట్టాలు అమలు చేస్తున్నా.. మృగాళ్లు పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు.

కేరళ పాలక్కడ్​ జిల్లాలోని త్రితాలా గ్రామంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ ప్రాథమిక పాఠశాలకు చెందిన 59 మంది బాలికలపై కృష్ణన్​(57) అనే దుకాణదారుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చాక్లెట్లు కొనుక్కోవడానికి దుకాణానికి వచ్చినవారితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించేవాడు.

అయితే గత గురువారం ఓ బాలిక ఈ విషయాన్ని పాఠశాలలో చెప్పింది. ఖంగు తిన్న టీచర్లు మొత్తం విషయంపై ఆరా తీశారు. ఆ బాలికతో సహా మరికొంతమంది ఇదే విషయాన్ని ఉపాధ్యాయులతో పంచుకున్నారు.

వృద్ధుడి దుశ్చర్యను సామాజిక కార్యకర్తల దృష్టికి తీసుకెళ్లారు టీచర్లు, తల్లిదండ్రులు. అందరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 59 మంది బాలికలపై కొన్నేళ్లుగా కృష్ణన్​ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేలింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న దుకాణదారుడు పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

New Delhi, July 15 (ANI): Finance Minister, Nirmala Sitharaman today spoke at Vigyan Bhawan on the occasion of the fourth anniversary of Skill India mission. She said that the government was using the offset money of Rafale deal to train people. She said, "During election campaigning, the Opposition was saying that Modi ji gave offset money from Rafale Deal to someone. I ask, to whom? Today, offset money is available to be used for skill training. Today we have signed MoU with Dassault for the same."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.