ETV Bharat / bharat

మొరపెట్టుకున్నా వినలేదు.. అందుకే ఇలా... - కరోనా కొత్త వార్తలు

అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని ఆటోలో తీసుకెళ్లేందుకు పాస్ అడిగితే అవసరం లేదన్నారు. కానీ.. ఆ పోలీసులే అనుమతి లేకుండా ఎందుకు బయటకు వచ్చారని అడ్డుకున్నారు. చేసేది లేక... తండ్రిని మోసుకుంటూ ఇంటికి తీసుకెళ్లాడో కుమారుడు. మనసును కలచివేసే ఈ ఘటన కేరళలో జరిగింది.

Man forced to carry father on shoulders after cops stop autorickshaw at punalur, kerala
లాక్​డౌన్​ ఎఫెక్ట్​: మొరపెట్టుకున్నా వినలేదు.. అందుకే ఇలా!
author img

By

Published : Apr 16, 2020, 2:00 PM IST

లాక్​డౌన్​ నిబంధనల విషయంలో కొందరు పోలీసుల అవగాహన లోపం... ఓ కుటుంబాన్ని తీవ్ర అవస్థలకు గురిచేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని... కుమారుడు మోసుకెళ్లాల్సిన దుస్థితికి కారణమైంది. ఈ వ్యవహారంపై కేరళ మానవ హక్కుల సంఘం సుమోటోగా కేసు నమోదు చేసింది.

లాక్​డౌన్​ ఎఫెక్ట్​: మొరపెట్టుకున్నా వినలేదు.. అందుకే ఇలా!

ఏం జరిగింది?

కేరళ కొల్లాం జిల్లా కులతుపుజాకు చెందిన 85ఏళ్ల వ్యక్తి కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల పునాలుర్​ తాలూకా ఆసుపత్రిలో చేరి.. ఆరోగ్యం కుదుటపడటం వల్ల బుధవారం డిశ్చార్జ్​ అయ్యాడు. అతని కుమారుడు రాయ్​మన్​తో కలిసి​ ఆటోరిక్షాలో ఇంటికి వెళ్తుండగా పోలీసులు టీబీ జంక్షన్​ వద్ద నిలిపేశారు. లాక్​డౌన్​ వేళ వాహనాలు తిరిగేందుకు అనుమతి లేదని తెగేసి చెప్పారు. తన తండ్రి పరిస్థితిని రాయమ్​న్​ వివరించినా పట్టించుకోలేదు.

వెంటనే రాయ్​మన్​ ఆసుపత్రికి నడుచుకుంటూ వెళ్లి సూపరింటెండెంట్​ ఇచ్చిన లేఖ తీసుకొచ్చాడు. అయినప్పటికీ పోలీసులు అనుమతించకపోగా.. నడుచుకుంటూ వెళ్లాలని ఆదేశించారు. వారికి భయపడి ఇతర వాహనాలూ సాయమందించేందుకు నిరాకరించాయి. ఇక వేరే గత్యంతరం లేక రాయ్​మన్​ తన తండ్రిని మోసుకొంటూ, తల్లితో కలిసి ఇంటికి తీసుకెళ్లాడు.

"ఆటోలో తండ్రిని తీసుకెళ్లేందుకు వీలుగా పాస్​ ఇవ్వాలని ముందే కులతుపుజా పోలీస్​ స్టేషన్​కు వెళ్లి అడిగాను. కానీ.. అప్పుడు పోలీసులు అవసరం లేదన్నారు. స్వీయ అఫిడవిట్ చూపిస్తే చాలని చెప్పారు. ఇప్పుడేమే ఇలా ఇబ్బందులకు గురిచేశారు" అని ఆవేదన వ్యక్తంచేశాడు రాయ్​మన్​.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.