చెన్నై విమానాశ్రయంలో జంతువుల స్మగ్లర్‌ను అరెస్టు చేశారు కస్టమ్స్ అధికారులు. థాయ్‌లాండ్ నుంచి అరుదైన జీవరాశులను తరలిస్తూ చెన్నైలోని అధికారులకు చిక్కాడు మహ్మద్ మొయిద్దీన్.
పక్కా సమాచారంతో అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మొయిద్దీన్ అనుమానాస్పదంగా విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా పట్టుకున్నారు.
మొయిద్దీన్ దగ్గర ఎర్ర ఉడత, 12 కంగారూ ఎలుకలు, 3 ప్రియరీ కుక్కలు, 5 బ్లూ లాగూనాలు ఉన్నాయి. ఇవన్నీ అంతరించిపోతున్న జీవరాశుల జాబితాలో ఉన్నాయి. ఈ జంతువులను తిరిగి థాయ్‌లాండ్ పంపనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకు అయ్యే ఖర్చును.. మొయిద్దీన్ నుంచి వసూలు చేస్తామన్నారు.
ఇదీ చూడండి: 'నాన్నా.. అమ్మను, తమ్ముడిని బాగా చూసుకో గుడ్‌బై'