సాంకేతికతతో ప్రపంచం ఎంతో ముందుకు వెళుతోంది. కానీ ఆ వెంటే వస్తున్న కాలుష్య భూతం కారణంగా జీవవైవిధ్యం దెబ్బతింటోంది. పక్షుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పిచ్చుకలు కనిపించే పరిస్థితులు లేవు. ఆ చిన్ని పక్షులను రక్షించాలని సంకల్పించుకున్నాడు ఓ వ్యక్తి.
శరవణన్... తమిళనాడు నాగపట్టణం వాసి. 'విళుతు ఐయ్యక్కమ్' పేరిట సామాజిక సంస్థ నిర్వహిస్తారు. పిచ్చుకల సంరక్షణకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.
పిచ్చుకలు నివాసం ఉండేలా కలపతో చిన్న చిన్న ఇళ్లు తయారు చేయిస్తున్నారు శరవణన్. వాటిని ఉచితంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు పంపిణీ చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.
ఇదీ చూడండి: ఈ పావురం 1750 కి.మీ. పయనించి గిఫ్ట్ కొట్టేసింది!