అలవాట్లు మితిమీరితే వ్యసనాలు అవుతాయి. కొన్ని సార్లు వ్యసనం చేసే చెరుపు అంతా ఇంతా కాదు. జూదం, మద్యం మనిషిని ఎంతటి నీచస్థితికి దిగజార్చుతాయో తెలిపే సంఘటన ఇది. మద్యానికి బానిసైన ఓ ప్రబుద్ధుడు భార్యను జూదంలో పందెం కట్టాడు. ఓడిపోయిన కారణంగా ఆ పందెంలో పాల్గొన్నవారు భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ జుగుప్సాకరమైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.
యూపీలోని జౌన్‌పుర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో జూదం ఆడేందుకు అతని స్నేహితుడు అరుణ్, బంధువు అనిల్ తరుచూ ఇంటికి వెళ్తుండేవారు. ఈ క్రమంలో సదరు వ్యక్తి జూదంలో డబ్బులు పోగొట్టుకొని తన భార్యను పందెంగా పెట్టాడు. మళ్లీ ఓడిపోయిన కారణంగా అతని బంధువు, మిత్రుడు బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సంఘటన జరిగాక బాధితురాలు తన మేనమామ ఇంటికి వెళ్లిపోయింది.
భర్తే ఉసిగొల్పి...
ఆమె వద్దకు వెళ్లి క్షమించమని బతిమలాడి ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు భర్త. మార్గమధ్యంలో కారును ఆపి నిందితులిద్దరినీ.. ఆమెపై మరోసారి అత్యాచారం చేసేందుకు ఉసిగొల్పాడు.
ఈ నేపథ్యంలో బాధితురాలు జఫరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు. చివరకు ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు సామూహిక అత్యాచారం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: వృద్ధురాలి ప్రాణం తీసిన ఆవు!