ETV Bharat / bharat

క్యామ్​స్కానర్​కు పోటీ- దేశీ యాప్​ రిలీజ్​ చేసిన దీదీ

author img

By

Published : Jul 6, 2020, 6:55 PM IST

బంగాల్ రాష్ట్ర ఐటీ విభాగం రూపొందించిన డాక్యుమెంట్​ స్కానింగ్​ యాప్​ను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ యాప్​... దేశభక్తిని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.

Mamata launches document scanning app
'దేశభక్తి ప్రతిబింబించేలా 'సెల్ఫ్​ స్కాన్​' యాప్​'

బంగాల్ రాష్ట్ర ఇన్పర్మేషన్​ టెక్నాలజీ (ఐటీ) విభాగం సరికొత్త డాక్యుమెంట్​ స్కానింగ్​ యాప్ 'సెల్ఫ్​ స్కాన్​'​ను అభివృద్ధి చేసింది. సోమవారం ఆ యాప్​ను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ యాప్ దేశభక్తికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

చైనా వస్తువులను బహిష్కరించాలనే డిమాండ్ల నేపథ్యంలో ఇటీవలే 59 డ్రాగన్​ దేశ యాప్​లను నిషేధించింది కేంద్రం. వాటిలో డాక్యుమెంట్ స్కానింగ్​కు ఉపయోగించే క్యామ్​స్కానర్​ ఒకటి. ఈ నిర్ణయం తీసుకున్న కొద్ది రోజులకే బంగాల్ ప్రభుత్వం సెల్ఫ్​ స్కాన్​ యాప్​ను ఆవిష్కరించటం ప్రాధాన్యం సంతరించుకుంది.

"నేను ఎప్పుడూ దేశీయంగా అభివృద్ధి చేసిన యాప్​లనే ఉపయోగిస్తాను. అది దేశభక్తిని ప్రతిబింబిస్తుంది. ఈ రోజు బంగాల్​ ఏమి ఆలోచిస్తుందో.. రేపు ప్రపంచ మొత్తం దాని గురించే ఆలోచన చేస్తుంది. "

- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.