ETV Bharat / bharat

మోదీ, రాజ్​నాథ్​లు తమ గెలుపుపై దృష్టి పెట్టాలి: మమతా - పౌరసత్వ చట్ట సవరణ బిల్లు

మోదీ, రాజ్​నాథ్​లపై మండిపడ్డ మమతా బెనర్జీ

మోదీ, రాజ్​నాథ్​లు తమ గెలుపుపై దృష్టి పెట్టాలి: మమతా
author img

By

Published : Feb 2, 2019, 11:40 PM IST

ప్రధాని మోదీ, రాజ్​నాథ్​లు తమ లోక్​సభ స్థానాల్లో గెలవడంపై దృష్టిసారించాలని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సూచించారు. ఆ తర్వాతే పశ్చిమబంగాలో విజయంపై కలలు కనాలని విమర్శించారు.

భాజపా నేతలకు రాష్ట్ర సంప్రాదాయలు, ఆచారాలపై అవగాహన లేదని మండిపడ్డారు. పశ్చిమబంగాలో మోదీ, రాజ్​నాథ్​ల ర్యాలీలు అనంతరం మమతా ఈ వ్యాఖ్యలు చేశారు.

"భాజపా నేతలు పశ్చిమబంగాకు చెందినవారు కాదు. వారికి రాష్ట్ర సంప్రదాయాలపై అవగాహన లేదు. వారికి రాష్ట్ర ప్రజలకు సంబంధం లేదు. పశ్చిమబంగా గురించి ఆలోచించే ముందు వారందరు తమ సొంత రాష్ట్రాలపై శ్రద్ధ పెట్టాలి."
--- మమతా బెనర్జీ, పశ్చిమబంగా ముఖ్యమంత్రి.

పౌరసత్వ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తాం...

పౌరసత్వ చట్ట సవరణ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తోందని మమతా స్పష్టం చేశారు. బిల్లును కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు.

"కేంద్రం పౌరసత్వ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాల్సిందే. మేము బిల్లుకు మద్దతివ్వము, మోదీని గెలవనివ్వము."
---- మమతా బెనర్జీ, పశ్చిమబంగా ముఖ్యమంత్రి.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.