ETV Bharat / bharat

కర్రల వంతెనతో ప్రకృతికే కొత్త కళ

సాంకేతికత అద్భుతాలు సృష్టించగలదేమో కానీ... ప్రకృతి అందాన్ని పెంచగలదా? ఇలాంటి ప్రశ్నే కర్ణాటకలోని ఓ ప్రకృతి ప్రేమికుడి మదిలో మెదిలింది. అందుకే, ప్రాణం లేని కాంక్రీటు, ఇనుప కడ్డీలతో వంతెనలు కట్టడమెందుకని.. జీవ కళ ఉట్టిపడే వెదురు వంతెనలు నిర్మిస్తున్నాడు. పూర్వకాలం నాటి వంతెనలనూ పునర్ నిర్మిస్తున్నాడు.

Making of Wooden Bridges instead of Concrete to get the Beauty of Nature
కర్రలతో కట్టిన వంతెన.. ప్రకృతికే కళ తెచ్చింది!
author img

By

Published : Jul 17, 2020, 4:15 PM IST

కర్రల వంతెనతో ప్రకృతికే కొత్త కళ

చిన్న చిన్న నదులు దాటేందుకు కాంక్రీటు వంతెనలే కావాలా? వందల ఏళ్ల క్రితం ఇంతటి సాంకేతికత లేనప్పుడు ప్రజలు నదులు దాటనే లేదా? అందుకే... పూర్వకాలంలో నదిని దాటేందుకు ఉపయోగించిన వెదురు వంతెనలను పునర్ నిర్మిస్తున్నాడు కర్ణాటక ఉడుపి జిల్లాకు చెందిన పురుషోత్తం ఆద్వే. అవసరమైన గ్రామాల్లో కొత్త వంతెనలు కట్టేసి ప్రకృతి పట్ల ప్రేమను చాటుతున్నాడు.

స్మార్ట్​ సిటీ బెంగళూరు రాజధానిగా ఉన్నప్పటికీ కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికీ ఎన్నో గ్రామాలకు రోడ్డు మార్గం లేదు. ఇక వర్షాకాలంలో నదీ తీరాన ఉండే గ్రామస్థులు పట్నానికి వెళ్లాలంటే మెడలోతు నీటిలో నానా తంటాలు పడాల్సిందే. కాకర్ల తాలూకా, మన్నపాపు గ్రామంలోనూ ఇదే పరిస్థితి. ఈ ఊరిలో బడిపిల్లలు నదిని దాటి పాఠశాలలకు వెళ్లడం పెద్ద సవాలు.

దీంతో, ఉడుపిలో ప్రకృతి అందాలు దెబ్బతినకుండా.. పర్యావరణహితమైన 'సేతుబంధు' కార్యక్రమాన్ని చేపట్టాడు పురుషోత్తం. మన్నపాపు గ్రామంలోనూ ఈ ప్రకృతి వంతెన నిర్మించాలని పూనుకున్నాడు. అడవిలో దొరికే వనరులతోనే.. అందమైన, దృఢమైన వారధి​ కట్టేశాడు. దాదాపు 30 అడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పున్న ఈ వంతెన ఇప్పటి తరాన్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది.

ఇదీ చదవండి: పనస పండ్లు కోయడానికి బ్రిడ్జ్​ నిర్మాణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.