కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం ఎక్కువ మంది రైతులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, చట్టాలకు మద్దుతు తెలుపుతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా సర్వే చేపడితే 99.9 శాతం మంది రైతులు మద్దతుగా నిలుస్తారన్నారు.
వ్యవసాయ చట్టాలకు మద్దతుగా భాజపా నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. విపక్షాలన్నీ కూటమై చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలను ప్రేరేపిస్తున్నారన్నారు. కానీ వ్యవసాయ చట్టాలకు సంబంధించి వారు కూడా అదే చేస్తున్నారని దుయ్యబట్టారు.
అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో జరిగిన చర్చలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. మూడు వ్యవసాయ చట్టాల కాపీలను చింపి వేయడాన్ని తప్పుబట్టారు. కొంతమంది మాత్రమే సాగు చట్టాలను వ్యతిరేకిస్తుంటే మరికొందరు నిరసనల్లో పాల్గొంటున్నారని తెలిపారు. విపక్షల అనవసర రాద్దాంతంతో రైతులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి: 'ఆ మాత్రం దానికి నూతన పార్లమెంట్ భవనమెందుకు'