'మై బీ చౌకీదార్' నినాదానికి మద్దతు తెలిపిన ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దీనితో పాటు దేశంలోని 500 ప్రాంతాల్లో ఏకకాలంలో లక్షల మంది భారతీయులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగాన్ని వీక్షించేందుకు భాజపా ఏర్పాట్లు చేసింది. వారిలో కొందరితో మోదీ స్వయంగా మాట్లాడతారు.
'మనం ఎదురుచూసిన రోజు వచ్చేసింది. ఈరోజ సాయంత్రం లక్షలాది చౌకీదారులు 'మై బీ చౌకీదార్' కార్యక్రమంలో భాగమవుతారు. యువత, నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తున్నా. వీరే దేశానికి బలం. 21 శతాబ్దంలో వీరి శ్రమ వల్లే భారతదేశం ముందడుగు వేస్తోంది.'
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.