దివాకర్ చనిపోయే ముందు తన ప్రవర్తనలో మార్పు.. మొబైల్లో ఉన్న కోడ్ భాషలు, ఫేస్బుక్, వాట్సాప్ డీపీల్లోనూ ఉత్తరంలో రాసిన బ్లాక్ పాంథన్ (నల్ల చిరుత) చిత్రాలే ఉండడం పోలీసుల అనుమానాన్ని బలపరుస్తున్నాయి.
"మాలీ కుటుంబసభ్యులు పెర్నే ఫటా పట్టణంలో నివాసముంటారు. దివాకర్ వఘోలీలోని కామర్స్ కాలేజ్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గత కొన్ని రోజులుగా రాత్రంతా కూర్చుని అతనేదో ఆన్లైన్ ఆట ఆడుతున్నాడు. రెండు రోజులుగా కాలేజ్‌కి వెళ్లడం లేదు. ఆకస్మాత్తుగా తను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఆడిన ఆటేదో తెలియాల్సి ఉంది."
-పోలీస్ అధికారి.
బ్లూవేల్స్ అనే ఆన్లైన్ ఆట అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వందలాది ప్రాణాలు బలిగొంది. ఒక్కసారి ఆ యాప్‌ను ఇన్స్టాల్ చేస్తే ఎవరైనా ఆ ఆటకు బానిస కావాల్సిందే. ఒక్కో లెవల్లో ఒక్కో ఛాలెంజ్‌తో చివరికి వారిని చనిపోయేలా చేస్తుంది. అయితే ఇలాంటి ప్రమాదకరమైన ఆన్లైన్ ఆటలను ప్రంచమంతా నిషేధించినా.. అక్రమంగా అలాంటి ఆటలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. 'బ్లాక్ పాంథన్' కూడా ఇలాంటి ఆటే అయ్యి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదీ చూడండి:మీసం కత్తిరించారని సెలూన్‌పై కేసు!