మహారాష్ట్రలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు రాష్ట్రపతి పాలన దిశగా సాగుతున్నట్లు రాజ్యాంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక చేతులెత్తేసింది. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి మరింత సమయం కావాలని శివసేన చేసిన వినతిని గవర్నర్ తిరస్కరించిన నేపథ్యంలో.. తాజా పరిస్థితులు రాజ్యాంగ సంక్షోభం దిశగానే సాగుతున్నాయని విశ్లేషిస్తున్నారు.
తాజాగా ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. మిత్రపక్షంగా కాంగ్రెస్ నిలిచినప్పటికీ.. ఎన్సీపీకి మెజారిటీ లేదు. తమ పార్టీకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని శివసేన పట్టుబడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి ఉద్ధవ్ మద్దతు దొరకడం కష్టమే. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ విఫలమైందని, రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం మినహా గవర్నర్కు మరో అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి: 'మహా' ప్రతిష్టంభన: సేనకు చిక్కని పీఠం-ఎన్సీపీకి ఆహ్వానం!