ETV Bharat / bharat

మరో 6 నెలలు మాస్కులు తప్పనిసరి: సీఎం - ఉద్ధవ్​ ఠాక్రే వార్తలు

కొవిడ్​-19 నుంచి రక్షణ పొందేందుకు మరో ఆరు నెలల పాటు మాస్క్​లు తప్పనిసరిగా వాడాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే స్పష్టంచేశారు. మాస్క్​ల వినియోగాన్ని అలవాటుగా మార్చుకోవాలని రాష్ట్ర ప్రజలకు సూచించారు.

Maharashtra: Masks mandatory for next 6 months, says Thackeray
మరో ఆర్నెల్లు మాస్కులు ధరించాల్సిందే: ఠాక్రే
author img

By

Published : Dec 20, 2020, 3:31 PM IST

కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలంటే ఇంకో ఆరు నెలల వరకు మాస్కులు ధరించాల్సిందేనని మాహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే అన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు మాస్క్​ను వాడకాన్ని అలవాటుగా మార్చుకోవాలని పేర్కొన్నారు ఠాక్రే.

వైద్య నిపుణులు.. రాత్రి కర్ఫ్యూ, లాక్​డౌన్​ విధించాలని సూచిస్తున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో వీటిని తాను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో కొద్దిరోజులుగా వైరస్​ కేసులు తగ్గుముఖం పట్టాయన్న ఠాక్రే.. ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదన్నారు.

దేశంలోనే అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. ఇప్పటివరకు అక్కడ 18.92 లక్షల మంది వైరస్​ బారినపడ్డారు. వారిలో 48వేల 648 మంది చనిపోయారు.

ఇదీ చదవండి: నీటి ద్వారా కొత్త వ్యాధి- కేరళలో ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.