ETV Bharat / bharat

ఎన్​సీపీ ఎప్పుడూ భాజపాతో చేతులు కలపదు: పవార్

author img

By

Published : Nov 23, 2019, 1:39 PM IST

అనేక నాటకీయ మలుపుల మధ్య మహారాష్ట్రలో భాజపా సర్కారు కొలువుదీరిన తీరుపై... శివసేన, ఎన్​సీపీ తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఎన్​సీపీ శాసనసభాపక్ష నేతగా ఉన్న అజిత్‌ పవార్‌ కొంత మంది ఎమ్మెల్యేలతో కలిసి భాజపాకు మద్దతిచ్చారని.. ఇది అనైతికమని ఆ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ స్పష్టం చేశారు. శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేతో కలిసి మీడియాతో మట్లాడారు శరద్​ పవార్.

భాజపాతో ఎన్​సీపీ ఎప్పుడూ చేతులు కలపదు: పవార్

మహారాష్ట్రలో భాజపా అనూహ్యంగా ప్రభుత్వం ఏర్పాటుచేయడంపై ఎన్​సీపీ , శివసేన సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా తొలుత ఎన్​సీపీ అధినేత శరద్‌ పవార్‌ మీడియాతో మాట్లాడుతూ.. శివసేన- కాంగ్రెస్‌- ఎన్​సీపీ నేతృత్వంలో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావించామన్నారు. తమకు 170 మంది సభ్యుల బలం ఉందన్నారు.

కొంతమంది స్వతంత్ర ఎమ్మెల్యూలూ మద్దతు తెలిపారన్నారు. అజిత్‌ పవార్‌ది వ్యక్తిగత నిర్ణయమేననీ.. ఆయన పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారన్నారు. ఆయన నిర్ణయంతో ఎన్​సీపీలో ఎవరూ సంతోషంగా లేరన్నారు. పార్టీ ఫిరాయిస్తే శాసనసభ సభ్యత్వం కూడా కోల్పోతారని ఆయనతో వెళ్లినవాళ్లు గుర్తుంచుకోవాలని పవార్‌ హెచ్చరించారు. అజిత్‌తో కలిసి వెళ్లినవారిలో 10 నుంచి 11 మంది ఎమ్మెల్యేలు ఉంటారని చెప్పారు. నిజమైన ఎన్​సీపీ కార్యకర్తలు, నేతలు ఎప్పుడూ భాజపాతో చేతులు కలపరని శరద్‌ పవార్‌ స్పష్టంచేశారు.

రాష్ట్రపతి పాలన ఎత్తివేత, రాజ్‌భవన్‌లో దేవేంద్ర ఫడణవీస్‌ సీఎంగా ప్రమాణస్వీకారోత్సవం గురించి ఈ ఉదయం 6.30 గంటలకు తనకు తెలిసిందని పవార్‌ వెల్లడించారు.

బలం నిరూపించుకోలేదు..

భాజపా ప్రభుత్వం అసెంబ్లీలో బలం నిరూపించుకోలేదని శరద్‌ పవార్‌ అన్నారు. ఈరోజు సాయంత్రం జరిగే ఎన్​సీపీ శాసనసభాపక్ష సమావేశంలో శాసనసభాపక్ష నేత అజిత్‌ పవార్‌ తొలగింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. బేరసారాలకు పాల్పడటం భాజపాకు అలవాటేనని విమర్శించారు.

సర్జికల్‌ స్ట్రైక్స్‌ తరహాలో...

మహారాష్ట్రలో భాజపా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. ప్రజాతీర్పును అవమానించారని తమపై ఆరోపణలు చేయడం సరికాదని విమర్శించారు. పాకిస్థాన్‌పై జరిపిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ తరహాలో మహారాష్ట్రలో చేశారంటూ ఉద్ధవ్‌ ధ్వజమెత్తారు.

New Delhi, Nov 23 (ANI): Twitter has finally fixed a major issue with its two-factor authentication (2FA) security settings. In an official tweet, the company wrote that Twitter will now allow users to remove their phone number from their 2FA settings. Users can also enrol in 2FA without a phone number, Mashable noted. Twitter's 2FA had been criticised because it required users to opt into SMS-based codes, which puts security at risk. Recently, the company also admitted to inadvertently using people's 2FA phone numbers for ad targeting.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.