ETV Bharat / bharat

దిల్లీ నుంచి ముంబయికి విమానాలు బంద్‌! - maharashtra government is planning to stop aeroplane services to mumbai due to corona virus

దిల్లీ నుంచి ముంబయికి వచ్చే విమానాలను నిలిపివేయాలని మహారాష్ట్ర సర్కార్​ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దిల్లీలో కరోనా వైరస్​ విజృంభణ కొనసాగుతుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

maharashtra government is planning to stop aeroplane services to mumbai due to corona virus
దిల్లీ నుంచి ముంబయికి విమానాలు బంద్‌!
author img

By

Published : Nov 20, 2020, 8:35 PM IST

దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాకపోకలకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దిల్లీ నుంచి ముంబయికి వచ్చే విమానాలను నిలిపివేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ రెండు ప్రధాన నగరాల మధ్య నడిచే రైళ్ల సేవలను కూడా నిలిపివేయాలని చూస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

అక్టోబర్ 28 నుంచి దిల్లీలో కరోనా కేసుల్లో ఆకస్మిక పెరుగుదల కనిపించింది. నవంబర్‌ 11న 8వేల మార్కును దాటి ఆందోళనకు గురిచేసింది. అలాగే గడిచిన 24 గంటల్లో 7,500 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ క్రమంలో దిల్లీ ప్రభుత్వం కఠిన నిబంధనలకు ఉపక్రమించింది. వివాహ వేడుకల వంటి శుభకార్యాలకు 50 మందిని మాత్రమే అనుమతించడం, మాస్క్‌ ధరించని వారికి రూ.2,000 జరిమానా విధించడం వంటి చర్యలకు పూనుకుంది.

కొవిడ్-19 కేసులు అధిక సంఖ్యలో వెలుగుచూస్తోన్న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఉన్నతస్థాయి బృందాలను పంపే యోచనలో ఉన్నట్లు శుక్రవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వెలుగులోకి రాని కేసులను గుర్తించేందుకు విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాలకు సూచించింది.

ఇదీ చూడండి:గోవాకు సోనియా- కొంతకాలం అక్కడే మకాం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.