మహారాష్ట్రలో వర్ష విలయం కొనసాగుతోంది. భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలమవుతోంది. గురువారం ఆ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబయి, ఠానే నగరాలతో సహా ఉత్తర కొంకణ్ ప్రాంతంలో రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది.
కొనసాగుతున్న సహాయక చర్యలు..
భారీ వానలతో ముంబయిలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పుణె జిల్లాలోని నిమగాన్ కేత్కి గ్రామంలో వరదల నుంచి బుధవారం.. 40 మందిని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు.
"పుణెలో 40 మందిని వరద విలయం నుంచి కాపాడాము. వరద ప్రభావిత ప్రాంతమైన నిమగాన్ కేత్కిలో మరో 15 మందిని రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. "
-- బారామతి సబ్ డివిజినల్ అధికారి.
ఇందాపుర్లో వరదలతోపాటు కొట్టుకుపోతున్న ఇద్దరు వ్యక్తులను అధికారులు కాపాడారు.
ఇదీ చూడండి:రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక-ఇవి తప్పనిసరి..