మరాఠా ప్రజలు మరోసారి భాజపా-శివసేన కూటమికే పట్టం కట్టనున్నారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. భారీ ఆధిక్యంతో కాషాయ కూటమి మరోసారి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని విశ్లేషించాయి.
మహారాష్ట్రలో అసెంబ్లీలోని 288 స్థానాలుండగా, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 145 స్థానాలు అవసరం. భాజపా-శివసేన కూటమికి దాదాపు 230 వరకు సీట్లు, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి 48 సీట్లు వస్తాయని టైమ్స్ నౌ అంచనా వేసింది.
వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల వివరాలు...
సర్వే సంస్థ | భాజపా-శివసేన | కాంగ్రెస్-ఎన్సీపీ | ఇతరులు |
టైమ్స్ నౌ | 230 | 48 | 10 |
ఇండియా టుడే-మై యాక్సిస్ | 181 | 81 | 26 |
న్యూస్ 18- ఐపీఎస్ఓఎస్ | 243 | 41 | 4 |
ఏబీపీ సీ-ఓటర్ | 204 | 69 | 15 |
జన్ కీ బాత్ | 223 | 54 | 11 |
పోల్ ఆఫ్ పోల్స్ | 213 | 61 | 14 |