మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భాజాపాకు గవర్నర్ ఆహ్వానం పంపిన నేపథ్యంలో ఆ పార్టీ కోర్ కమిటీ సమావేశమైంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలో జరిగిన ఈ భేటిలో మహారాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
భవిష్యత్ కార్యచరణపై సమావేశంలో చర్చించినట్లు భాజపా సినియర్ నేత సుధీర్ ముంగంటివార్ వెల్లడించారు. ఈరోజు సాయంత్రం మరోమారు సమావేశమై ఏ నిర్ణయం తీసుకోవాలో సమాలోచలు చేస్తామని చెప్పారు. ఉదయం జరిగిన భేటీలో.. చర్చించిన అంశాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు ముంగంటివార్.
మహారాష్ట్ర ప్రభుత్వ గడువు శనివారంతో ముగిసింది. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపాను ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ నిన్న ఆహ్వానించారు.
ఇదీ చూడండి: విధులను విస్మరించి వాట్సాప్ చాటింగ్ చేసినందుకు...