మహారాష్ట్రలో మావోలు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. గడ్చిరోలి జిల్లా అబుజ్మడ్ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సలైట్లు మరణించారు.
డిసెంబర్ 2 నుంచి 8 వరకు మావోయిస్టులు నిర్వహించే 'పీపుల్స్ లిబరేషన్ గురిళ్లా ఆర్మీ' వారోత్సవాల సన్నహాక సమావేశానికి నక్సల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నక్సల్ వ్యతిరేక దళాలు రంగంలోకి దిగి మావోయిస్టుల స్థావరాలను నేలమట్టం చేసినట్లు అధికారులు తెలిపారు.