ETV Bharat / bharat

'వలస' బతుకులు: నడిచి.. నడిచి.. ప్రాణం విడిచి!

ఎలాగైనా ఇంటికి చేరాలని ఓ వలసకూలీ మండుటెండలో కాలిబాట పట్టాడు. కొన్ని రోజులపాటు ఆకలిబాధలను పట్టించుకోకుండా నడుస్తూనే ఉన్నాడు. శరీరంలో సత్తువ నశించింది. కళ్లు మసకబారుతూ.. అడుగులు దారి తప్పుతున్నాయి. సరే విశ్రాంతి తీసుకుందామని దగ్గర్లో ఓ షెడ్​ కనిపిస్తే పడుకున్నాడు. అంతే, ఆ నిద్రలోనే అనంతలోకాలకు వెళ్లిపోయాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

Maha: Labourer dies of hunger, dehydration while walking home
నడకలోనే ముగిసిపోతున్న వలసబతుకులు
author img

By

Published : May 20, 2020, 5:45 PM IST

కరోనా దెబ్బకు వలస కూలీల బతుకులు ఛిద్రమైపోతున్నాయి. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి ఉన్నచోట తినడానికి తిండి దొరక్క, ఆదరించే దిక్కులేక కాలినడకన సొంతూళ్ల బాటపడుతూ మధ్యలోనే తనువు చాలిస్తున్న వలస కూలీలెందరో..! కనీసం తమ కుటుంబ సభ్యులతోనైనా కలిసి ఉండొచ్చనే ఆశతో ఇంటికి బయల్దేరిన వారి బతుకులు మధ్యలోనే ముగిసిపోతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో పదుల సంఖ్యలో వలస కూలీలు ప్రాణాలు కోల్పోగా.. మహారాష్ట్రలో మరో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది.

పింటూ పవార్‌ (40) అనే వ్యవసాయ కూలీ మహారాష్ట్రలోని పుణె నుంచి పర్బానీ జిల్లాలోని తన స్వగ్రామానికి బయల్దేరాడు. లాక్‌డౌన్‌తో వాహనాలు తిరగకపోవడం వల్ల ఎలాగైనా తన సొంతూరుకు చేరుకోవాలనే ఆశతో మండే ఎండల్లో కాలి నడకన బయల్దేరాడు. ఈ క్రమంలో అతడు ఆకలితో, డీహైడ్రేషన్‌తో ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు వెల్లడించారు. పుణె నుంచి తన స్వగ్రామానికి బయల్దేరిన పింటూ పవార్‌.. బీద్‌ జిల్లాలోని ధనోరా గ్రామంలో (స్వగ్రామానికి 200 కి.మీల దూరంలో) సోమవారం ప్రాణాలు కోల్పోయినట్టు అంభోరా పోలీస్‌ స్టేషన్‌ అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ ధ్యానేశ్వర్‌ కుక్లరే తెలిపారు.

నడిచి నడిచి అలసిపోయిన పింటూ పవార్‌ ఆకలితో, డీహైడ్రేషన్‌కు గురై ప్రాణాలు కోల్పోయినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. మృతుడు పర్బానీ జిల్లాలోని మాన్వాట్ దోప్టే పొందుల్‌ గ్రామానికి చెందినవాడిగా గుర్తించాం. లాక్‌డౌన్‌తో పనిలేకపోవడం వల్ల పుణెలోని తన సోదరుడి వద్దకు వెళ్లాడు. ఆ తర్వాత తన సొంత గ్రామానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకొని మే 8న కాలినడకన పుణె నుంచి బయల్దేరాడు. ఆ తర్వాత మే 14న అహ్మద్‌నగర్‌ చేరాడు. అయితే, అతడి వద్ద మొబైల్‌ ఫోన్‌ లేకపోవడం వల్ల వేరొకరి ఫోన్‌తో కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత అక్కడి నుంచి మరో 30 నుంచి 35 కి.మీల మేర నడక కొనసాగించి అక్కడే ఓ షెడ్‌ వద్ద విశ్రాంతి తీసుకున్నాడు

- పోలీసు అధికారులు

అయితే, సోమవారం ఆ వైపుగా వెళ్తున్న కొందరు బాటసారులు ఆ షెడ్‌ నుంచి దుర్వాసన వస్తోందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు పింటూ పవార్‌ మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులతో సంప్రదించిన తర్వాత.. ధనోరా గ్రామ పంచాయతీ అధికారులు, పోలీసులు అంత్యక్రియలను నిర్వహించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.