ETV Bharat / bharat

మహారాష్ట్రలో 10 వేలు దాటిన కరోనా బాధితులు

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో ఇవాళ మరో 583 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం వైరస్​ బాధితులు సంఖ్య 10 వేలు దాటినట్లు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. తమిళనాడులో రికార్డు స్థాయిలో గడిచిన 24 గంటల్లో 161 మందికి వైరస్​ సోకింది. అలాగే దిల్లీకి చెందిన ఆరుగురు సీఆర్​పీఎఫ్​ జవాన్లకు వైరస్ పాజిటివ్​గా తేలింది.

Maha hits grim milestone of 10,000-plus COVID-19 cases; 27 die
మహారాష్ట్రలో 10 వేలు దాటిన కరోనా బాధితులు
author img

By

Published : Apr 30, 2020, 11:16 PM IST

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. అత్యధిక కేసులు నమోదయిన నేపథ్యంలో వైరస్ కేసుల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో గుజరాత్, దిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు నిలిచాయి.

మహారాష్ట్రలో 10 వేలు దాటిన కరోనా కేసులు

మహారాష్ట్రలో రోజూ వందల సంఖ్యలో పాజిటివ్​ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 583 మందికి వైరస్​ సోకింది. రాష్ట్రంలో 10,498 మందికి వైరస్​ సోకినట్లు అధికారులు వెల్లడించారు. కొత్తగా మరో 27 మంది మరణించగా.. మొత్తంగా మృతుల సంఖ్య 459కి చేరింది.

గుజరాత్​లో 4 వేలకు పైగా

గుజరాత్​లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇవాళ మరో 313 మందికి వైరస్ పాజిటివ్​గా​ నిర్ధరణ అయింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 4,395కు చేరినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 214 మంది వైరస్​కు బలయ్యారు. 613 మంది ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారని​ సమాచారం.

తమిళనాడులో రికార్డు స్థాయిలో 161 కేసులు

తమిళనాడులో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 161 మందికి వైరస్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. దీంతో వైరస్ బాధితుల సంఖ్య 2,323కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 1,258 మంది కోలుకున్నట్లు చెప్పారు. మొత్తంగా 27 మంది మహమ్మారికి బలయ్యారు.

పంజాబ్​లో 100కు పైగా కేసులు

పంజాబ్​​లో నేడు మరో 105 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 480 మంది ప్రాణాంతక వైరస్​ బారిన పడినట్లు రాష్ట్ర అధికారులు ప్రకటించారు. కొత్తగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 104 మందికి వైరస్​ నయమైంది.

ఉత్తర్​ప్రదేశ్​లో 40 మంది మృతి

ఉత్తరప్రదేశ్​లో నేడు మరో 77 మంది మహమ్మారి బారినపడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,211 మందికి వైరస్​ సోకినట్లు ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. మొత్తం 482 మంది డిశ్ఛార్జ్​ అయ్యారు. మరో 40 మంది మృతి చెందారు.

మధ్యప్రదేశ్​లో మరో 65 కేసులు

మధ్యప్రదేశ్​లో కరోనా బాధితుల సంఖ్య మరింత పెరిగింది. నేడు కొత్తగా 65 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా 2,625 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 7 మంది మృతి చెందగా.. మరణాల సంఖ్య 137కు పెరిగింది. 482 మందిలో వైరస్ నయమైంది.

బంగాల్​లో

బంగాల్​లో నూతనంగా నమోదైన 37 కేసులతో కలిపి 758 మందికి వైరస్ సోకింది. ఇవాళ మరో 11 మంది మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 33కు చేరింది. ఇప్పటి వరకు 139 మంది డిశ్ఛార్జి​ అయ్యారు.

కర్ణాటకలో 22 మంది మృతి..

కర్ణాటకలో గురువారం తాజాగా మరో 30 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తం 565 మందికి వైరస్​ సోకినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 22 మృతి చెందగా, 229 మంది ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు.

ఒడిశాలో తాజాగా 17 కేసులు

ఒడిశాలో తాజాగా 17 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో 142 మంది వైరస్​ బారిన పడినట్లు తెలిపింది. మహమ్మారి బారిన పడి 39 మంది కోలుకోగా.. ఒకరు మృతి చెందారు.

దిల్లీలో ఆరుగురు జవాన్లకు కరోనా

దేశ రాజధానిలోనూ కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా దిల్లీలోని సీఆర్​పీఎఫ్​ బెటాలియన్​లో మరో ఆరుగురుకి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు అధికారులు వెల్లడించారు. వీరంతా ఒకే బెటాలియన్​కు చెందిన వారని తెలిపారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 52కు చేరింది. దిల్లీ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,439 మందికి వైరస్ సోకగా.. 56 మంది మృతి చెందారు. మరో 1092 మంది మహమ్మారి బారిన పడి కోలుకున్నారు.

రాష్ట్రాల వారీగా..

ఉత్తరాఖండ్​లో ఇప్పటి వరకు 55 మంది వైరస్​ బారిన పడగా 36 మంది కోలుకున్నారు. జమ్ముకశ్మీర్​లో 581 మందికి వైరస్​ సోకింది. అలాగే బిహార్​లో 403 మంది బాధితులు ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.