ETV Bharat / bharat

కరోనా పెరుగుతున్నా.. ముంబయిలో ప్రయాణాలకు ఓకే - corona in mumbai

ముంబయి.. దేశంలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్న నగరం. కేసుల సంఖ్య రోజు రోజు విపరీతంగా పెరిగిపోతున్నా.. ముంబయి మెట్రోపాలిటన్​ ప్రాంతం పరిధిలో అంతర్​ జిల్లా రాకపోకలకు అనుమతి ఇచ్చింది మహారాష్ట్ర సర్కార్​. 'మిషన్​ బిగిన్​ అగేయిన్'​ కార్యక్రమంలో భాగంగా మూడు దశల్లో వివిధ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం.

Maha govt
ముంబయి మెట్రోపాలిటన్​ ప్రాంతం
author img

By

Published : Jun 4, 2020, 5:33 PM IST

Updated : Jun 4, 2020, 5:45 PM IST

దేశంలో కరోనా కేసుల్లో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉంది. అందులో ముంబయి మహానగరంలోనే అత్యధిక కేసులు ఉన్నాయి. ఓ వైపు రోజు రోజుకు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా.. ముంబయి మెట్రోపాలిటన్​ ప్రాంతం (ఎంఎంఆర్) పరిధిలోని అంతర్​ జిల్లా రాకపోకలకు అనుమతించింది ప్రభుత్వం. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఎంఎంఆర్​ పరిధిలో ముంబయి నగరం, ముంబయి సబర్బణ్​, ఠాణె, పల్ఘర్​, రాయ్​గఢ్​ జిల్లాలోని కొంత భాగం ఉన్నాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాల్లోనే అత్యధికంగా కొవిడ్​-19 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ 56,794 పాజిటివ్​ కేసులు ఉండగా, 1,742 మంది ప్రాణాలు కోల్పోయారు.

ముంబయి మెట్రోపాలిటన్​ పరిధిలోని అంతర్​ జిల్లా రాకపోకలపై కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది ప్రభుత్వం. అంతర్​రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. వలస కార్మికుల తరలింపు నియమాల ప్రకారం.. వలస కార్మికులు, పర్యటకులు, యాత్రికుల ప్రయాణాలపై నియంత్రణ చర్యలు కొనసాగుతాయని తెలిపింది.

'మిషన్​ బిగిన్​ అగేయిన్​'

'మిషన్​ బిగిన్​ అగేయిన్​' కార్యక్రమంలో భాగంగా తొలిదశలో మే 31న బహిరంగ శారీరక కార్యక్రమాలకు కొన్నింటికి అనుమతులు ఇచ్చింది మహారాష్ట్ర. అయితే.. కొత్త మార్గదర్శకాల్లో ఉద్యానవనాలు, ఓపెన్​ ఎయిర్​ జిమ్స్​, ఆట మైదానాలకు అనుమతులు లేవని స్పష్టం చేసింది.

రెండో దశ

రెండో దశలో భాగంగా జూన్​ 5 నుంచి అన్ని రకాల దుకాణాలకు అనుమతించింది ప్రభుత్వం. అయితే.. రోడ్డుకు ఒక పక్కన ఉన్న దుకాణాలు ఒక రోజు.. మరుసటి రోజున అవతలి పక్కన ఉన్న షాపులు తెరుచుకుంటాయని తెలిపింది. దుకాణాల్లో భౌతిక దూరం పాటించటం, ట్రాఫిక్​ నియంత్రణ వంటి చర్యలకు మున్సిపల్​, పోలీస్​ కమిషనర్లు దుకాణదారులను సమన్వయపరుస్తూ.. ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని సూచించింది.

మూడో దశ..

మూడో దశలో భాగంగా ప్రైవేటు కార్యాలయాలు సుమారు 10 శాతం సిబ్బందితో పని చేసేందుకు అనుమతించింది మహారాష్ట్ర. మిగతా వారికి ఇంటి నుంచి పని కల్పించాలని స్పష్టం చేసింది. ఉద్యోగుల వ్యక్తిగత భద్రతపై అవగాహన కల్పించాలని సూచించింది. అలాగే.. జూన్​ 7 నుంచి వార్తా పత్రికలు డెలివరీ చేయోచ్చని, డెలివరీ చేసే వ్యక్తి తప్పనిసరిగా మాస్కు ధరించాలని తెలిపింది.

ఇదీ చూడండి: మహారాష్ట్రలో నిసర్గ బీభత్సం.. ఇళ్లపై కూలిపడిన చెట్లు

Last Updated : Jun 4, 2020, 5:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.