ETV Bharat / bharat

మహారాష్ట్ర, తమిళనాడులో కరోనా విజృంభణ - covid-19 news

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 2,361 కేసులు బయట పడినందున రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 70 వేలు దాటింది. తమిళనాడులోనూ వరుసగా రెండో రోజు వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

Maha COVID-19 case
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ
author img

By

Published : Jun 1, 2020, 9:01 PM IST

మహరాష్ట్రలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2,361 కొత్త కేసులు నమోదయ్యాయి. 76 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 70,013, మృతుల సంఖ్య 2,362కు చేరింది.

24 గంటల్లో 779 మంది రోగులు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రులను నుంచి డిశ్చార్జి అయినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు మొత్తం 30,108 మంది కోలుకున్నారని తెలిపింది. ప్రస్తుతానికి రాష్ట్రంలో 37,543 మంది చికిత్స పొందుతున్నారని, 4,71,473 నమూనాలను పరీక్షించినట్లు పేర్కొంది.

వరుసగా రెండోరోజు వెయ్యికిపైగా కేసులు..

తమిళనాడులో కరోనా వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతోంది. వరుసగా రెండోరోజు వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,162 కేసులు నమోదు కాగా, 11 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసులు సంఖ్య 23,495, మృతుల సంఖ్య 184కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 50 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

తమిళనాడులో ఆదివారం 1,149 కేసులు నమోదయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.