మహారాష్ట్రను మళ్లీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వానల కారణంగా నాసిక్ జిల్లాలోని త్రయంబకేశ్వరాలయం సమీపంలో వరద నీరు రోడ్లపై ప్రవహిస్తూ నదిని తలపిస్తోంది. రోడ్ల పక్కన నిలిపిన వాహనాలూ వరదల్లో కొట్టుకుపోయాయి.
తొరంగాణ ఘాట్లో మోఖాడా, త్రయంబకేశ్వర్ రహదారిపై భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. మోఖాడా-నాసిక్ల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
పాల్ఘర్ జిల్లాలో వరదలకు ఓ పై వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని జిల్లా అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: కాలువలో పడిన చిన్నారి.. దొరకని ఆచూకీ