ప్రధానమంత్రి నరేంద్రమోదీ హత్యకు కుట్ర జరుగుతోందా? తాజాగా జరిగిన ఓ సంఘటన ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. నాగపుర్ విమానాశ్రయం వద్ద ప్రధాని హెలికాఫ్టర్‌ను చిత్రీకరించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం పోలీసులు.
ఈ చిత్రాలు ముంబయికి చెందిన ఓ వ్కక్తి ఫోన్లో లభ్యమయ్యాయి. గత ఆదివారం మహారాష్ట్ర బండారా జిల్లాలోని సాకోలీ పట్టణంలో ప్రచారానికి వెళ్లారు మోదీ. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులు ప్రధాని హెలికాఫ్టర్ ఫొటోలను తీశారని సమాచారం. ముంబయికి చెందిన మరో వ్యక్తి చరవాణిలోనూ ఈ ఫొటోలు లభ్యమయ్యాయని తెలుస్తోంది.
ఇటీవలే పాక్ ఉగ్రవాదుల హెచ్చరికలు
ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ ఆధారిత ఉగ్రవాదులు భారత్‌తో కయ్యానికి కాలు దువ్వాలని చూస్తున్నారు. ప్రధాని మోదీ, అమిత్‌షా, డోభాల్లను హిట్ లిస్ట్‌లో చేర్చామంటూ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ గత నెలలో లేఖ పంపింది. దేశంలోని 30 నగరాల్లోనూ దాడి చేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మోదీ హెలికాప్టర్‌ను ఇద్దరు వ్యక్తులు ఫొటోలు తీయడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
ఇదీ చూడండి: కృత్రిమ గర్భంతో ఒకే కాన్పులో నలుగురు..!