మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో గుంపులుగా పడి ఉన్న శునకాల మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. అటవీ ప్రాంతంలో దాదాపు 90 శునకాల మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. విపరీతమైన దుర్వాసన రావడం వల్ల ఆదివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
100కు పైగా కుక్కలను రోడ్డుపై 5చోట్ల విసిరేసినట్లు గుర్తించిన పోలీసులు. వాటిలో 90 శునకాలు చనిపోయినట్లు తెలిపారు. పట్టణ శివార్ల నుంచి శునకాలను తెచ్చి.. వాటిని చంపి అడవిలో విసిరేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై జంతువుల పట్ల క్రూరప్రవర్తన చట్టం 1960, ఇండియన్ పీనల్ కోడ్ల కింద కేసు నమోదు చూసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కుక్కలను ఎవరు.. ఎందుకు చంపారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చూడండి: భర్త ఎదుటే భార్యా-పిల్లల సజీవ దహనం