ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ గ్రామం చెరువును తలపిస్తుంది. ఊరి చివరనున్న కాలువ నిండి నీరు ఉప్పొంగుతుంది. ఈ ప్రవాహంలో గ్రామం దాటి వెళ్లడం పెద్ద సాహసం. అత్యవసర సేవలు అందాలంటే ఇబ్బంది. అంబులెన్స్ వచ్చేందుకు కూడా వీలు లేకుండా తయారవుతాయి రోడ్లు.
నౌగావ్ గ్రామంలో ఓ మహిళ మృతి చెందింది. అదే రోజు వర్షం కురిసింది. శ్మశానానికి వెళ్లే మార్గమంతా నీటితో నిండిపోయింది. ప్రవాహం తగ్గే వరకు దాదాపు 8 గంటలు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచారు. వరద వద్ధృతి కాస్త తగ్గాక, బంధువులు, స్థానికులు మోకాళ్ల లోతు నీటిలో పాడెను మోసుకెళ్లారు.
కొన్నేళ్లుగా కాలువపై వంతెన నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడంలేదంటూ నిరసన తెలిపారు గ్రామస్థులు. సమస్యపై స్పందించిన మాండ్‌సోర్ కలెక్టర్ మనోజ్ పుష్ప్ వర్షాకాలం ముగిశాక కాలువ నిర్మిస్తామని చెప్పారు.
ఇదీ చూడండి:నేటి భారతం... మహాత్మునికే అపచారం!