మధ్యప్రదేశ్- దేవాస్‌లో మంగళవారం సాయంత్రం రెండంతస్తుల భవనం కూలిన ఘటనలో ఇద్దరు మరణించారు. మరో 16 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
లాల్ గేట్ సమీపంలో గల స్టేషన్ రోడ్డు వద్ద సంభవించిన ఈ ప్రమాదంలో ఇంకా దాదాపు 12 మందికిపైగా శిథిలాల్లో చిక్కుకున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
రెండు మూడు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తోన్న వర్షాల వల్లే భవనం కూలి ఉండొచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: 'మహా' భవనం కూలిన ఘటనలో 16కు చేరిన మృతులు