కొత్త(నయా) పాకిస్థాన్ గురించి మాట్లాడుతున్న ఇమ్రాన్‌ఖాన్ ఉగ్రవాదంపై కొత్తగా(నయా) చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేసింది. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రవీష్‌కుమార్... ఉగ్రవాద నిర్మూలనకు పాక్ నమ్మదగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
పుల్వామా దాడి అనంతరం జైషేకు వ్యతిరేకంగా మాత్రమే చర్యలు తీసుకున్నామని, దీనికి ప్రతిగా తీవ్రవాదులపై చర్యలు తీసుకోకుండా భారత్‌పై పాకిస్థాన్ దాడి చేసిందని తెలిపారు. వాయుసేన ప్రకటించినట్లు ఫిబ్రవరి 27 ఒక్క మిగ్ 21 బైసన్‌ను మాత్రమే కోల్పోయామని పునరుద్ఘాటించారు.
రెండో విమానాన్ని కూల్చినట్లు తమ దగ్గర వీడియో ఆధారాలున్నాయని పాక్ చెబుతోంది. ఒకవేళ అదే నిజమైతే..... వారం రోజుల తర్వాత కూడా ఎందుకు వాటిని అంతర్జాతీయ మీడియాకు వెల్లడించలేదు? ఆ యుద్ధ విమాన శకలాలు ఏమయ్యాయి? పైలట్‌కు ఏమైంది?
- రవీష్ కుమార్, భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి.
తమ భూభాగం నుంచి ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలను అనుమతించమని ఇమ్రాన్‌ఖాన్ శుక్రవారం ఒక ప్రకటన చేశారు. దీనిపై స్పందిస్తూ ఇలాంటి ప్రకటనలు ఎన్నో సార్లు విన్నామని అన్నారు రవీష్‌కుమార్.