కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్యం చేసేందుకు తాను సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలో రెండోరోజూ గందరగోళం కొనసాగుతోంది. బుధవారం సభ ప్రారంభమైన వెంటనే ప్రధాని మోదీ దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి విపక్షాలు. ప్రశ్నోత్తరాల సమయంలో స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లారు 30 మంది సభ్యులు. 'మోదీ జవాబ్ దో' నినాదాలతో సభను హోరెత్తించారు. పలుమార్లు ఆందోళనల అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు కాంగ్రెస్ ఎంపీలు.
ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మౌనం వహిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ సభాపక్షనేత అధీర్ రంజన్ చౌదరి.
రాజ్‌నాథ్ స్పందన..
కశ్మీర్ అంశాన్ని ట్రంప్‌తో మోదీ చర్చించలేదని ప్రతిపక్షాల డిమాండ్‌కు సమాధానం చెప్పారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రి జై. శంకర్ ఇది వరకే స్పష్టం చేశారన్నారు. కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వానికి అవకాశమే లేదన్నారు రాజ్‌నాథ్. అలా చేస్తే అది సిమ్లా ఒప్పందానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'సీనియర్ న్యాయవాదుల సమక్షంలోనే ఆదేశాలిస్తాం'