పార్లమెంటులో ప్లాస్టిక్ నిషేధిస్తూ లోక్సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ సంబంధిత వస్తువులు, బాటిల్స్ వాడరాదని అధికారులు, అనుబంధ సంస్థ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా బయోడీగ్రేడబుల్ వస్తువులను ఉపయోగించాలని సూచించింది.
ప్లాస్టిక్ వాడొద్దని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలను కోరారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ ఏడాది అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చేందుకు ముందుకురావాలని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి:పెళ్లి వయసుపై కేంద్రానికి దిల్లీ హైకోర్టు నోటీసులు