17వ లోక్‌సభ తొలి సమావేశాలు అర్థవంతంగా జరుగుతున్నాయి. జూన్ 17న ప్రారంభమై, ఈ నెల 26 వరకూ సమావేశాలు కొనసాగనున్నాయి. గత ఇరవై ఏళ్లలో 128 శాతం ఉపయోగకరంగా జరుగుతున్న సమావేశాలుగా ఈ దఫా మీటింగ్స్ చరిత్ర సృష్టించాయని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ అనే పరిశోధనా సంస్థ ప్రకటించింది.
బడ్జెట్‌పై 17 గంటలపాటు చర్చ జరగగా, రైల్వే కేటాయింపులపైన 13, రహదారులు భవనాలపైనా 7.44 గంటల పాటు లోక్‌సభలో చర్చించారు.
గ్రామీణాభివృద్ధి, వ్యవసాయానికి కేటాయింపులపై 10.36 గంటల పాటు చర్చ జరిగింది. క్రీడలు, యువజన వ్యవహారాలపై 4.14 గంటల పాటు లోక్‌సభ సమావేశమైంది.
గత కొద్దిరోజులుగా శూన్య గంటను నిర్వహించలేదు. గురువారం నాటి శూన్యకాలంలో ప్రజలకు అత్యవసరమైన అంశాలను లేవనెత్తాలని సభ్యులకు సూచించారు స్పీకర్ ఓం బిర్లా.
గురువారం శూన్యకాలం గడువును పొడిగించిన సమయంలో 162 మంది సభ్యులు వివిధ ప్రజోపయోగకరమైన అంశాలను లేవనెత్తారు. ఈ కారణంగా రాత్రి 10.50 గంటల వరకు సభలో చర్చ జరిగింది.
ఈ దఫా సమావేశాలు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కంటే ఎక్కువ సమయం జరుగుతున్నాయి. లోక్‌సభ చర్చ 128 శాతం ఉత్పాదకత సాధించిందని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. రాజ్యసభా ఇదే కోవలో ఎక్కువకాలం కార్యకలాపాలను నిర్వహించింది. రాజ్యసభ ఉత్పాదకత 98శాతంగా నమోదైంది.
ఇదీ చూడండి: ఆ పార్టీల జాతీయ హోదా.... గల్లంతేనా?