కాంగ్రెస్ అధ్యక్షుడికి 'జలియన్‌వాలా బాగ్ జాతీయ స్మారక ట్రస్ట్' శాశ్వత సభ్యత్వం తొలగించేలా రూపొందించిన సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. వీరి ఆందోళనల మధ్యే మూజువాణి ఓటు ద్వారా బిల్లు ఆమోదం పొందింది.
బిల్లుకు ప్రతిపక్షాలు పలు సవరణలు ప్రతిపాదించగా.. అవి ఓటింగ్‌లో వీగిపోయాయి.