దేశంలో ఎలక్ట్రానిక్ సిగరెట్ల ఉత్పత్తి, తయారీ, ఎగుమతులు, దిగుమతులు, రవాణా, నిల్వ, అమ్మకాలు, ప్రకటనలు పూర్తిగా నిషేధించేందుకు లోక్సభ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఈ-సిగరెట్లపై నిషేధం విధిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు.. పార్లమెంట్ దిగువసభ ఆమోదం తెలిపింది.
వ్యాపార సంస్థలు సరికొత్త ఫ్యాషన్ అంటూ ప్రచారం చేస్తున్న ఈ-సిగరెట్ల నుంచి యువకుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు నిషేధం అవసరమని తెలిపారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్.
రూ.లక్షల్లో జరిమానా, జైలు శిక్ష
ఈ-సిగరెట్ల నిషేధ నిబంధనలు మొదటిసారి అతిక్రమించిన వారికి ఏడాది జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించేలా బిల్లులో ప్రతిపాదనలు చేశారు. అదే తప్పు పునరావృతం చేస్తే మూడు సంవత్సరాల వరకూ జైలు శిక్ష, ఐదు లక్షల జరిమానా విధించేలా బిల్లులో ప్రతిపాదనలు చేశారు. కొత్త చట్టం ప్రకారం ఈ సిగరెట్లను నిల్వచేసిన వారు ఆరునెలల జైలుశిక్ష, 50 వేల జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి : సిగరెట్లు ఎక్కువగా కాలుస్తున్నారా? ఇది మీకోసమే..