మిజోరం గవర్నర్ కుమ్మనమ్ రాజశేఖరన్శుక్రవారంతన పదవికి రాజీనామా చేశారు. 10 నెలల క్రితమే గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికిఅందజేశారు. రామ్‌నాథ్ కోవింద్ రాజశేఖరన్ రాజీనామాకు ఆమోదం తెలిపారని రాజ్‌భవన్ అధికార ప్రతినిధి ప్రకటించారు. గతేడాది మే 25న మిజోరం గవర్నర్‌గా రాజశేఖరన్ బాధ్యతలు చేపట్టారు.
తిరువనంతపురం నుంచి పోటీ!
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా కేరళలోని తిరువనంతపురం నుంచి పోటీ చేసే ఆలోచనలో రాజశేఖరన్ ఉన్నారని సమాచారం. ఈ విషయంపై అటు భాజపా, ఇటు రాజశేఖరన్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కేరళకు సంబంధించి లోక్‌సభ అభ్యర్థులనూ ప్రకటించలేదు.
ముక్కోణ పోరు తప్పదా...
ఒకవేళ రాజశేఖరన్ తిరువనంతపురం నుంచి పోటీ చేస్తే 'లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్)', 'యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్)', 'భాజపా' మధ్య ముక్కోణ పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్-యూడీఎఫ్ కూటమి అభ్యర్థిగా శశిథరూర్ మూడోసారి ఈ స్థానం నుంచి పోటీ చేయనున్నారని సమాచారం.