ETV Bharat / bharat

సుప్రీంకోర్టు జడ్జీల పెంపు బిల్లుకు లోక్​సభ ఆమోదం

సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 30 నుంచి 33కు పెంచేందుకు ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్​సభ ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని ప్రధానిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి కోరిన కొద్దిరోజులకే బిల్లు తీసుకొచ్చారు.

సుప్రీంకోర్టు
author img

By

Published : Aug 5, 2019, 11:36 PM IST

సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచడానికి ఉద్దేశించిన సుప్రీంకోర్టు సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తుల సంఖ్యను 30 నుంచి 33కు పెంచే బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

సుప్రీంకోర్టు కార్యకలాపాలపై సభ్యులు ప్రశ్నించగా రవిశంకర్​ ప్రసాద్ సమాధానాలిచ్చారు. న్యాయస్థానానికి సంబంధించిన విభేదాలు బయటికి రాకూడదన్నారు. విభేదాలను అంతర్గతంగానే పరిష్కరించుకోవాలని, అందులో ప్రభుత్వం జోక్యం ఉండకూడదని స్పష్టం చేశారు.

సీజేఐతో కలిపి 34

ఈ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందిన అనంతరం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరనుంది. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి సహా 31మంది న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు సాగిస్తోంది.

సూచించిన కొద్ది రోజులకే..

సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి కోరిన కొద్దిరోజులకే బిల్లు తీసుకొచ్చారు. చివరిసారి 2009లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 25 నుంచి 30కి కేంద్రం పెంచింది. సుప్రీంకోర్టులో పెండింగ్‌ కేసులు పెరిగిపోతున్నందున పరిష్కారంగా కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 60వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

ఇదీ చూడండి: 370 రద్దుపై శివసేన, ఆర్​ఎస్​ఎస్​ హర్షం

AP Video Delivery Log - 1400 GMT News
Monday, 5 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1339: UK Politics AP Clients Only 4223723
UK PM on NHS funding, Corbyn comments on dam
AP-APTN-1324: Pakistan Kashmir Protest 2 Part no access Pakistan 4223722
Pakistani Kashmir protest over India status revocation
AP-APTN-1318: Italy US Father AP Clients Only 4223719
US teen jailed in Italy police death visited by father
AP-APTN-1316: India Kashmir Protest Part no access India 4223717
New Delhi protest over Kashmir status revocation
AP-APTN-1244: Iraq Oil Tanker AP Clients Only 4223714
Oil Ministry denies seized tanker belongs to Iraq
AP-APTN-1241: Australia Euthanasia No access Australia 4223713
First person dies under Australia euthanasia laws
AP-APTN-1239: Hong Kong Protest Night AP Clients Only 4223712
Tear gas used near HK police station amid strike
AP-APTN-1202: China Currency AP Clients Only 4223709
China allows yuan to fall below seven to US$
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.