ETV Bharat / bharat

ఖాళీ చెయ్యని.. మాజీ ఎంపీలకు సదుపాయాలు కట్ - భాజపా తెలుగు న్యూస్​

పదవీ కాలం ముగిసి 5 నెలలు గడుస్తున్నా అధికారిక గృహ సముదాయాలను ఖాళీ చెయ్యకుండా ఉన్న మాజీ ఎంపీలపై లోక్​సభ గృహ కమిటీ చర్యలు చేపట్టింది. ఖాళీ చెయ్యని 27 మంది మాజీ ఎంపీల ఇళ్లకు సదుపాయాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

మాజీ 'ఎంపీ'ల ఇళ్లకు సదుపాయాలు కట్​
author img

By

Published : Oct 15, 2019, 6:22 PM IST

పదవీ కాలం ముగిసినా అధికారిక గృహ సముదాయాలు ఖాళీ చేయని మాజీ ఎంపీలపై లోక్‌సభ గృహ కమిటీ చర్యలు చేపట్టింది. అధికారిక గృహాలు ఖాళీ చేయని 27 మంది మాజీ లోక్‌సభ ఎంపీల ఇళ్లకు నీళ్లు,విద్యుత్‌, గ్యాస్ కనెక్షన్‌ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

భాజపా ఎంపీ సీఆర్‌ పాటిల్‌ అధ్యక్షత వహించిన ఈ కమిటీ దిల్లీలోని లుటెన్స్ ప్రాంతంలో సదరు ఎంపీలకు కేటాయించిన గృహాలను ఖాళీ చేయించేందుకు పోలీసుల సహకారం కోరింది. నిబంధనల ప్రకారం పదవీ కాలం ముగిసిన నెలరోజుల వ్యవధిలో ఎంపీలు అధికారిక నివాసాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది.

గడువు ముగిసి 5 నెలలు కావస్తున్నా కొందరు ఎంపీలు అధికారిక నివాసాలు ఖాళీ చేయలేదు. ఫలితంగా కొత్తగా ఎన్నికైన ఎంపీలకు నివాసాలను కేటాయించడం ఇబ్బందిగా మారింది. నూతన ఎంపీలు కొందరు ప్రస్తుతానికి తమ రాష్ట్ర వసతి గృహాల నుంచే పార్లమెంట్‌కు హాజరవుతున్నారు.

ఇదీ చూడండి:నోబెల్​ గ్రహీత అభిజిత్​పై ప్రశంసల వెల్లువ

Rajouri (J-K), Oct 15(ANI): Sufism has entrenched itself at the centre of cultural and spiritual life in India. The union territory of Jammu - Kashmir serves as the richest reservoir of this tradition and this can be well witnessed during the Urs of sufi saints in the region when people cutting across religious lines gather under one roof. So, giving a glimpse of this unique devotional culture, today we take you to the urs of Sain Ganji Sahib that was recently commemorated in the Rajouri district. Take a look.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.