ETV Bharat / bharat

లాక్​డౌన్​ వేళ రీడింగ్​ ఛాలెంజ్​కు సిద్ధమా? - పుస్తకాలు

లాక్​డౌన్ వేళ ఆన్​లైన్​లో రకరకాల ఛాలెంజ్​లు విసురుకుంటా కాలక్షేపం చేస్తున్నారు ప్రజలు. టైమ్​పాస్​తో పాటు విజ్ఞానాన్నీ పొందేలా ఓ సరికొత్త సవాలు విసిరింది కేంద్ర మానవ వనరులు, అభివృద్ధి మంత్రిత్వ శాఖ.

LOCKDOWN
లాక్​డౌన్​ వేళ రీడింగ్​ ఛాలెంజ్​కు సిద్ధమా?
author img

By

Published : Apr 5, 2020, 10:08 AM IST

కరోనా మహమ్మారిని అడ్డుకట్టేందుకు 21 రోజుల లాక్​డౌన్​ విధించింది ప్రభుత్వం. అయితే ఈ సమయంలో రీడింగ్​ ఛాలెంజ్​ను విసిరింది కేంద్ర మానవ వనరులు, అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఇందుకోసం బుక్​ క్లబ్​ను ఏర్పాటు చేసింది. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

దేశవ్యాప్తంగా ప్రైమరీ నుంచి పోస్ట్​ గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, అభ్యాసకులు ఈ లాక్​డౌన్ సమయంలో నేషనల్ డిజిటల్ లైబ్రరీ (ఎన్డీఎల్​)ను ఉపయోగించుకోవాలని కోరింది ఎమ్​హెచ్​ఆర్​డీ.

ఈ-లైబ్రరీలో ఉచితంగా పుస్తకాలు

నేషనల్ డిజిటల్ లైబ్రరీలో 70 భాషల్లో 3 లక్షల మంది రచయితలు రాసిన 10 మిలియన్లకు పైగా పుస్తకాలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలిపింది ఎమ్​హెచ్​ఆర్​డీ. ఇవే కాకుండా మరో 60 రకాల వనరులు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. వీటిలో ముఖ్యంగా పుస్తకాలు, థీసిస్, ఆడియో విజువల్ మెటీరియల్​, వెబ్​ కోర్సులు, సాహిత్యం , టెక్నాలజీ, ఫిలాసఫీ, నేచురల్ సైన్సెస్, లెక్కలు, తదితర అంశాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. వీటితోపాటు పాఠశాల అధ్యయనాలు, ఇంజినీరింగ్, సైన్స్, యూజీలోని ఇతర విభాగాలు, మేనేజ్‌మెంట్, లాకు సంబంధించిన పుస్తకాలూ ఉన్నాయి.

ఇదీ చదవండి: ఆగని కరోనా విజృంభణ- భారీగా పెరిగిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.