ETV Bharat / bharat

లాక్​డౌన్​ బోనస్​: దిల్లీలో 30% తగ్గిన కాలుష్యం! - lockdown latest news

కరోనా లాక్​డౌన్​ నేపథ్యంలో కొద్ది రోజుల నుంచి దాదాపు 90 నగరాల్లో వాయు కాలుష్య శాతం తగ్గింది. ఈ విషయాన్ని సిస్టమ్​ ఆఫ్​ ఎయిర్​ క్వాలిటీ అండ్​ వెథర్​ ఫోర్​క్యాస్టింగ్​ అండ్​ రీసెర్చ్ స్పష్టం చేసింది. ముఖ్యంగా ప్రమాదం అంచున ఉన్న దిల్లీ లాంటి నగరాల్లో కాలుష్యం కనిష్ఠ స్థాయిలో నమోదవుతున్నాయని వెల్లడించింది. అయితే.. ఇది ఓ మేలుకొలుపు అవ్వాలని.. ఇకనైనా అభివృద్ధి పేరుతో పర్యవరణాన్ని నాశనం చేయకూడదని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Lockdown: India breathes easy as over 90 cities record minimal air pollution
కరోనా పుణ్యం.. లాక్​డౌన్​ వేళ కాలుష్యం కనుమరుగు
author img

By

Published : Mar 29, 2020, 6:50 PM IST

వాయు కాలుష్యం.. ప్రపంచ దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న భారత్​కూ ఓ పెద్ద సమస్య. ముఖ్యంగా దిల్లీ వంటి ప్రధాన నగరాల్లో వాయు నాణ్యత పడిపోయి.. ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఫలితం అంతంత మాత్రమే. కానీ కరోనా వైరస్​ పుణ్యమా అని ఇప్పుడు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.

కరోనాను కట్టడి చేసే లక్ష్యంతో కేంద్రం 21 రోజుల లాక్​డౌన్​ విధించింది. దాదాపు 130కోట్ల మంది ప్రజలను ఇళ్లకే పరిమితమవ్వాలని స్పష్టం చేసింది. ఫలితంగా వానహ రాకపోకలు నిలిచి, పరిశ్రమలు మూతపడి.. కాలుష్య శాతం తగ్గిపోతోంది. వాయు నాణ్యత మెరుగుపడుతోంది. దిల్లీతో పాటు 90 నగరాల్లో కనిష్ఠ స్థాయిలో కాలుష్యం నమోదవుతోంది. ఈ విషయం కేంద్రం నేతృత్వంలోని సిస్టమ్​ ఆఫ్​ ఎయిర్​ క్వాలిటీ అండ్​ వెథర్​ ఫోర్​క్యాస్టింగ్​ అండ్​ రీసెర్చ్​(ఎస్​ఏఎఫ్​ఏఆర్​) అధ్యయనంలో తేలింది.

కాలుష్యపు కోరల్లో చిక్కుకుని ప్రమాదపు అంచున ఉన్న దిల్లీలో వాయు కాలుష్యం ఏకంగా 30శాతం తగ్గిందని పేర్కొంది. అహ్మదాబాద్​, పుణెలో 15శాతం మేర వాయు కాలుష్యం తగ్గినట్లు వెల్లడించింది.

ముఖ్యంగా శ్వాసకోస సమస్యలకు దారితీసే నైట్రోజెన్​ ఆక్సైడ్​(ఎన్​ఓఎక్స్​) కాలుష్య శాతం.... పుణె(43), ముంబయి(38), అహ్మదాబాద్​(50)లో పడిపోయినట్టు నివేదికలో పేర్కొంది. మిగతా నగరాల్లోనూ కాలుష్యశాతం సంతృప్తికరంగా ఉందని వెల్లడించింది.

'ఇది ఓ మేలుకొలుపు'

తాజా పరిణామాలు దేశానికి ఓ మెలుకొలుపుగా మారాలని పర్యావరణవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇక నుంచైనా అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని నాశనం చేయకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.

ఇదీ చూడండి : కేరళలో కరోనా అనుమానితుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.