ETV Bharat / bharat

వీడియో కాల్​ ద్వారా ఒక్కటైన 'కొత్త జంట' - Coronavirus Lockdown in Karnataka

భూమండలాన్ని గడగడలాడిస్తున్న కరోనా... ఎన్నో దేశాల్లో లాక్​డౌన్ అమలు చేయించి, పలు కార్యక్రమాలను వాయిదా వేయించింది. కానీ కర్ణాటకలో జరిగిన వివాహాన్ని ఆపలేకపోయింది. కొవిడ్-19కు ఏమాత్రం భయపడకుండా ఒక్కటైంది ఓ నూతన జంట. స్కైప్​ వీడియో కాల్​ ద్వారా పెళ్లి చేసుకుంది.

Lock Down Effect: New couple tied the knot over Video Call
వీడియో కాల్లో ఒక్కటైన 'కొత్త జంట'
author img

By

Published : Apr 21, 2020, 3:12 PM IST

Updated : Apr 21, 2020, 3:29 PM IST

కరోనా లాక్​డౌన్​ కారణంగా అనేక కార్యక్రమాలు, మరెన్నో పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. అయితే కర్ణాటకలో ఓ జంట ఆన్​లైన్​ వివాహం చేసుకుని అందరినీ అబ్బురపరిచింది. స్కైప్​లో వీడియో కాల్​ ద్వారా తమ సంప్రదాయాలు ప్రకారం ఒక్కటైంది ఆ కొత్త జంట.

ఇదీ జరిగింది.

కర్ణాటకలోని ధార్వాడ్​కు చెందిన ఇమ్రాన్, కొప్పాల్​ జిల్లాకు చెందిన తాజ్మా బేగంకు ఈ రోజు(21-04-2020)న వివాహం జరిపించాలని పెద్దలు నిశ్చయించారు. అయితే కరోనా కారణంగా దేశంలో లాక్​డౌన్​ అమల్లో ఉంది. పెళ్లి వాయిదా వేసేందుకు ఇష్టపడలేదు పెళ్లి పెద్దలు. తమ సంప్రదాయం ప్రకారం ఆన్​లైన్​లో వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. అంతే.. స్కైప్​లో వీడియో కాల్​ చేసి అటువైపు వధువు తల్లిదండ్రులు, బంధువులు.. ఇటువైపు వరుడు అమ్మనాన్నలు, మతపెద్దల సమక్షంలో పెళ్లి తంతు పూర్తి చేశారు.

లాక్​డౌన్​ ఎత్తవేసిన తర్వాత తమ కోడల్ని ఇంటికి తీసుకొస్తామని చెప్పారు వరుడు కుటుంబ సభ్యులు.

Lock Down Effect: New couple tied the knot over Video Call
బందువులతో వరుడు

స్కైప్​లో వధువు

వరుడు, వధువు

మత పెద్దల సమక్షంలో వరుడు

మత గురువు ప్రార్థనలు

ఇదీ చూడండి: కన్నబిడ్డను విడిచి ఒకరు.. కడుపులో బిడ్డతో మరొకరు!

Last Updated : Apr 21, 2020, 3:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.