దేశంలో చాలా రాష్ట్రాలు వరుణుడి ప్రతాపానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఉత్తరాఖండ్లో 6 రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి.
తాజాగా ఉత్తర్కాశీ పురోలా ప్రాంతంలో వరద ఉద్ధృతికి కొండ చరియలు విరిగి పడ్డాయి. దాంతో చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే రోడ్డు మార్గానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. వేరే గత్యంతరం లేక గ్రామస్థులు తాడును వంతెనలా ఉపయోగిస్తూ.. నదిలా నీరు ప్రవహిస్తున్న మార్గాన్ని దాటుతూ సాహసాలు చేయాల్సి వస్తోంది.
ఇదీ చూడండి:జలవిలయానికి 5 రాష్ట్రాలు కకావికలం