ETV Bharat / bharat

ఎన్డీఏతో ఎల్​జేపీ తెగదెంపులు- బిహార్​లో​ ఒంటరి పోరు! - బిహార్​ న్యూస్

అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిహార్​లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ఎన్డీఏతో తెగదెంపులు చేసుకుని ఒంటరిగానే పోటీచేయాలని ఎల్​జేపీ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తం 143 స్థానాల్లో జేడీయూకు పోటీగా చిరాగ్ పాసవాన్​ నేతృత్వంలోని పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్లు తెలుస్తోంది.

LJP likely to quit Bihar NDA, Chirag might himself contest in state polls
బిహార్​ ఎన్నికల్లో ఎల్​జేపీ ఒంటరిగా పోటీ
author img

By

Published : Sep 23, 2020, 1:52 PM IST

బిహార్​ ఎన్డీఏలో అసమ్మతి అంతకంతకూ తీవ్రమవుతున్నట్లు కనిపిస్తోంది. కూటమిలో భాగస్వామిగా ఉన్న లోక్ జనశక్తి పార్టీ(ఎల్​జేపీ) త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిశ్చయించుకున్నట్లు సమాచారం. బిహార్​ సీఎం నితీశ్​ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పోటీ చేసే 143 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపాలని ఎల్​జేపీ జాతీయ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

అయితే జాతీయ స్థాయిలో మాత్రం ఎన్డీఏలోనే కొనసాగనుంది ఎల్​జేపీ. రామ్​విలాస్ పాసవాన్​ కేంద్రమంత్రిగానే ఉండనున్నారు.

చిరాగ్​ పోటీ!

ప్రస్తుతం లోక్​సభ ఎంపీగా ఉన్న చిరాగ్ పాసవాన్ బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారని సమాచారం. కేవలం జాతీయ స్థాయి రాజకీయాలకే పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయాలపై ఆయన దృష్టి సారించినట్లు పార్టీలోని సీనియర్​ నేతలు తెలిపారు. బిహార్ ముఖ్యమంత్రి పీఠంపైనా ఆయన కన్నేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవికి చిరాగ్ అర్హుడని పార్టీ నాయకులు కూడా బహిరంగంగా ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

తొలుత బిహార్​లో ఎన్డీఏలోనే కొనసాగాలని చిరాగ్ భావించారు. 'బిహార్ ఫస్ట్... బిహారీ ఫస్ట్' అనే అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని ఆయన కోరారు. అయితే మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల నామినేషన్ సమయంలో జేడీయూ, ఎల్​జేపీ మధ్య విభేదాలు తలెత్తాయి. తమ పార్టీకి రెండు సీట్లు కేటాయించాలని చిరాగ్ కోరగా.. జేడీయూ అందుకు నిరాకరించింది.

ఇవీ చూడండి: 'బిహార్​లో ఎక్కువ స్థానాల్లో మీరే పోటీ చేయాలి'

బిహార్​ పొత్తులపై ఎటూ తేల్చని ఎల్​జేపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.