రాజస్థాన్ రాజధాని జైపుర్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జేడీఏ సర్కిల్ వద్ద వేగంగా వస్తున్న స్కూటర్‌ను ఆడీ కారు ఢీ కొట్టింది. స్కూటర్‌పై ఉన్న వ్యక్తి కొన్ని మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాడు. 200 మీటర్ల వరకు స్కూటర్‌ను లాక్కెళ్లింది కారు. ద్విచక్రవాహనంపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
కారులోని ఎయిర్ బ్యాగు తెరుచుకోవడం వల్ల అందులోనివారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. 15 రోజుల క్రితమే కొనుగోలు చేసి స్నేహితురాలితో కలిసి డ్రైవ్‌కు వెళుతున్నట్లు కారులోని యువకుడు తెలిపాడు.