దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ పూర్తయింది. 91 లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పోటీలో నిలిచిన 12వందల 79మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేసింది ఓటరుగణం.
ఉదయం 7 గంటలకంటే ముందే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు... లైన్లలో బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. సమస్యాత్మక ప్రాంతాల్లోనూ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టింది.
వెబ్‌క్యాస్టింగ్ ద్వారా ఓటింగ్ సరళిని పరిశీలించిన ఎన్నికల సంఘం.. ఎప్పటికప్పుడు ఓటింగ్ శాతాన్ని ప్రకటిస్తూ వచ్చింది.
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోనూ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లో, మహారాష్ట్ర గడ్చిరోలిలో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడానికి మావోలు ఐఈడీలు పేల్చారు. కానీ.. ఎలాంటి నష్టం వాటిల్లలేదు.
మిగిలిన 6 దశల పోలింగ్ పూర్తయ్యాక... మే 23న సార్వత్రిక ఎన్నికల ఫలితం వెలువడనుంది.