కర్ణాటక మైసూరులో దారుణం చోటుచేసుకుంది. మైసూరు జిల్లా పరిషత్ అధ్యక్షుడు పరిమళ శ్యాం దగ్గర డ్రైవర్గా పని చేస్తున్న వ్యక్తిపై ఓ దుండగుడు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. కత్తితో పలుమార్లు కిరాతకంగా గాయపరిచి హత్యచేశాడు. కోటె మండలం అంతరాసంతే గ్రామంలో ఈ ఘటన జరిగింది.
తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
నిందితుడు రవి(40)ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన నేరాన్ని రవి అంగీకరించినట్లు స్పష్టం చేశారు. అక్రమ సంబంధం కారణంగానే ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.