కర్ణాటకలో మందుబాబుల జోరు రోజురోజుకు పెరిగిపోతోంది. లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తొలిరోజు(సోమవారం) రూ.45కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా.. రెండోరోజు రూ. 197కోట్ల అమ్మకాలు జరిగాయి. ఇది దాదాపు ఐదు రెట్లు ఎక్కువ.
ఎక్స్జ్ అధికారుల ప్రకారం... మంగళవారం 36.37 లక్షల లీటర్ల దేశీయ లిక్కర్, రూ.182 కోట్ల విలువగల 7.02 లక్షల లీటర్ల బీరు అమ్ముడుపోయాయి. ఇంతటి భారీ స్థాయిలో కొనుగోళ్లు జరగడం చూసి అధికారులే ఆశ్చర్చపోతున్నారు.
దాదాపు 40రోజుల లాక్డౌన్ అనంతరం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మే 4 నుంచి మద్యం అమ్మకాలకు అనుమతులిచ్చింది కేంద్ర ప్రభుత్వం.
ఇదీ చూడండి:- ఎంత దయో మందుబాబులపై!