ETV Bharat / bharat

'ఐకమత్య వెలుగులతో కరోనా చీకట్లపై పోరాటం'

ఈ ఆదివారం రాత్రి దేశ ప్రజలంతా విద్యుత్ దీపాలు ఆపేసి కొవ్వొత్తులు, దివ్వెలను వెలిగించాలని కోరారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. సరిగ్గా 9 గంటలకు మొదలుపెట్టి 9 నిమిషాలపాటు ఇలాగే చేయాలన్నారు. లాక్​డౌన్​ విధించిన అనంతరం దేశ ప్రజలకు వీడియో సందేశమిచ్చిన మోదీ.. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటే కరోనాను జయించినట్లేనని పునరుద్ఘాటించారు.

Light up lamps on Sunday night to display collective strength to defeat coronavirus: PM
'కరోనాపై దేశమంతా ఏకమై లైట్లకు బదులు కొవ్వొత్తులు వెలిగించాలి'
author img

By

Published : Apr 3, 2020, 10:12 AM IST

Updated : Apr 3, 2020, 10:36 AM IST

దేశంలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు 21 రోజుల లాక్​డౌన్ విధించిన అనంతరం తొలిసారి దేశ ప్రజలనుద్దేశించి వీడియో సందేశమిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. జనతా కర్ఫ్యూతో భారతీయులు తమ శక్తిసామర్థ్యాలు చాటారని కొనియాడారు. ప్రజలంతా ఏకమై భారత్​లో కరోనాను తరిమికొడతారని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని. లాక్​డౌన్​ పాటించడంలో ప్రపంచానికి భారత్​ ఆదర్శంగా నిలుస్తోందన్న ఆయన.. ప్రస్తుతం అన్ని దేశాలు మన బాటలోనే నడుస్తున్నాయని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటే కరోనాను జయించినట్లేనని పునరుద్ఘాటించారు.

'ఐకమత్య వెలుగులతో కరోనా చీకట్లపై పోరాటం'

"ఈ ఆదివారం రాత్రి లైట్లన్నీ ఆపేసి కేవలం కొవ్వొత్తులు, దివ్వెలను వెలిగించాలి. సరిగ్గా 9 గంటలకు మొదలుపెట్టి 9 నిమిషాలపాటు దీన్ని కొనసాగించాలి. దేశ ప్రజలంతా కరోనాను తరిమికొట్టేందుకు ఈ విధంగా సంకల్పించుకోవాలి. సంకట సమయంలో ఇది భారతీయులకు శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది. మన సంకల్పాన్ని మించిన శక్తి ప్రపంచంలో ఏదీ ఉండదు. రండి... సంకల్పంతో కరోనాను ఎదిరించండి.

లాక్‌డౌన్‌ వేళ ప్రజలంతా ఇంట్లోనే ఉన్నా ఎవరూ ఒంటరివారి కాదు. లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా పాటించాలి. కరోనాపై పోరాడుతున్న అందరికీ ధన్యవాదాలు. భారతీయులు ఒంటరి కాదు. 130 కోట్లమంది భారతీయుల సంకల్పంతో మనమేంటో చాటుదాం. సామాజిక దూరమనే లక్ష్మణరేఖను ఎవరూ అతిక్రమించవద్దు."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

Last Updated : Apr 3, 2020, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.