ETV Bharat / bharat

చెన్నైలో ప్రముఖ న్యాయవాది దారుణ హత్య - Lawyer Rajesh age

తమిళనాడులో ప్రముఖ న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. ఒంటరిగా ఉన్న ఆయనపై ఏడుగురు దుండగుల ముఠా దాడి చేసి.. కత్తితో పొడిచింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు.

Lawyer murdered by a gang at Villivakkam in Tamilanadu
చెన్నైలో ప్రముఖ న్యాయవాది దారుణ హత్య
author img

By

Published : Oct 5, 2020, 10:26 PM IST

చెన్నైలో దారుణం జరిగింది. ఆదివారం రాత్రి స్థానిక ఎమ్​టీహెచ్​ రోడ్​లోని మోహన్​ రెడ్డి ఆసుపత్రి ఎదురుగా ప్రముఖ న్యాయవాది రాజేశ్​(38) కూర్చుని ఉండగా.. ఏడుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై కత్తితో దాడిచేశారు. దారుణంగా పొడిచి పరారయ్యారు. తీవ్ర గాయాలైన న్యాయవాది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.

చెన్నైలోని విల్లివాక్కంకు చెందిన రాజేశ్​ ఎగ్మోర్​ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. రాజేశ్​ భార్య(రమ్య) రాజకీయ నాయకురాలు. ఆయన బావ పామ్​సోము ఓ పేరు మోసిన రౌడీ. అతడిపై హత్య, దోపిడీ, హత్యాయత్నం వంటి పలు కేసులు పెండింగ్​లో ఉన్నాయి. 2015లో జరిగిన ఓ హత్య కేసులో​ రాజేశ్​ ప్రమేయం ఉంది.

ఈ పూర్తి వ్యవహారంపై విల్లివక్కం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా రాజేశ్​ హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్​ వెలుగులోకి వచ్చి వైరల్​గా మారింది.

ఇదీ చదవండి: రేప్ కేసు పెట్టేందుకు 800 కి.మీ ప్రయాణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.