ETV Bharat / bharat

'సంస్కరణల పేరిట చట్టాల రద్దు కుదరదు'

కరోనా సంక్షోభ సమయంలో వ్యాపార సంస్థలకు వెసులుబాటు కల్పించేలా పలు రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాల్లో కొన్ని మార్పులు చేశాయి. అంతర్జాతీయ కార్మిక సమాఖ్య (ఐఎల్‌వో)లో భారత్‌ సభ్యదేశంగా ఉందని, సంస్కరణల రూపంలో చట్టాలను రద్దు చేయడం కుదరదని నీతి ఆయోగ్‌ వైస్ ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు.

Laws cannot be repealed in the name of reform
'సంస్కరణల పేరిట చట్టాల రద్దు కుదరదు'
author img

By

Published : May 24, 2020, 7:38 PM IST

కార్మిక చట్టాల్లో సంస్కరణలు తీసుకురావడమంటే వాటిని రద్దు చేయడం కాదని, కేంద్రం ఎల్లప్పుడూ కార్మిక చట్టాల రక్షణకు కట్టుబడి ఉంటుందని నీతి ఆయోగ్‌ వైస్ ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో వ్యాపార సంస్థలకు వెసులుబాటు కల్పించేలా పలు రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాల్లో కొన్ని మార్పులు చేశాయి. ఈ క్రమంలోనే ఆదివారం పీటీఐ నిర్వహించిన ఇంటర్వ్యూలో రాజీవ్‌కుమార్‌ ఆ అంశంపై స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాల్లో కొన్ని కీలకమార్పులు చేయడం తమ దృష్టికి వచ్చిందని వెల్లడించారు. అంతర్జాతీయ కార్మిక సమాఖ్య(ఐఎల్‌వో)లో భారత్‌ సభ్యదేశంగా ఉందని, సంస్కరణల రూపంలో చట్టాలను రద్దు చేయడం కుదరదన్నారు. ఈ మేరకు కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ రాష్ట్రాలకు ఆదేశాలిచ్చినట్టు పేర్కొన్నారు.

ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికే పెద్దపీట వేస్తుందని రాజీవ్‌కుమార్ స్పష్టం చేశారు. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్‌, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాతో దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిలో పెట్టేందుకు అనేక వ్యాపారసంస్థలకు మూడేళ్లపాటు కార్మికచట్టాల నుంచి మినహాయింపునిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.