బంగాల్లో నిరసన జ్వాలలు చెలరేగాయి. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా భాజపా నాయకులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. అధికార ప్రభుత్వం అవినీతి, గూండా రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఆందోళనకారులు రహదారులపైకి వచ్చారు. 'చలో సచివాలయం' అంటూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.
ఈ నేపథ్యంలో కోల్కతాలో భారీగా భద్రత బలగాలను మోహరించారు అధికారులు. నిరసనకారులను అడ్డుకునేందుకు రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్ వాహనాలను మోహరించారు.
ఈ నెల 2న కేంద్ర హోంమంత్రి అమిత్షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో భేటీ అయ్యారు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్. ఈ సమావేశంలో అక్టోబరు 8న మమతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకే భాజపా ఆందోళనలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: 16 ఏళ్ల బాలికపై నెలరోజులుగా సామూహిక అత్యాచారం